న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా చేసుకోవాలని పుట్లూరు సీఐ సత్య బాబు సూచించారు. శనివారం సీఐ మాట్లాడుతూ డిశంబరు 31వ తేదీ రాత్రి మద్యం సేవించి రోడ్లపైకి వచ్చి గొడవలు పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలన్నారు. ఎక్కడైనా శాంతి భద్రతలు అదుపు తప్పితే ఎంతటివారిపైనైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.