పుట్లూరు మండల కేంద్రంలోని సూపర్ మార్కెట్ పక్కన అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి అతడి వద్ద నుంచి 27మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ హేమాద్రి తెలిపారు. అందిన సమాచారం మేరకు దాడులు చేసి అక్రమంగా మద్యం అమ్ముతున్న వెంకటరంగయ్యను అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి మద్యంను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసినట్లు చెప్పారు.