పుట్లూరు: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు

71చూసినవారు
పుట్లూరు: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు
వైఎస్సార్ జిల్లా కడప - తాడిపత్రి ప్రధాన రహదారిలోని కొండాపురం మండలం వెంకటాపురం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు అనంతపురం జిల్లా సురేపల్లె గ్రామానికి చెందిన రాము, అశోక్, ఆరేళ్ల చిన్నారి ప్రణయ్ తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మార్గమధ్యలో కారు ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

సంబంధిత పోస్ట్