పుట్లూరు మండలంలోని పుట్లూరు చెరువు నుంచి కోమటి కుంట్ల చెరువుకు శనివారం నీటిని విడుదల చేసినట్లు హెచ్చెల్సీ ఎస్సీ రాజశేఖర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువల వద్ద అక్రమంగా నీటిని ఎవరూ తరలించరాదని తెలిపారు. గ్రామస్థులు, నాయకులు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని చెప్పారు. త్వరలోనే బొప్పేపల్లి, గరుగుచింతలపల్లికి కూడా నీటిని విడుదల చేస్తామని వివరించారు.