శింగనమల: మంత్రుల దృష్టికి నియోజకవర్గ సమస్యలు

52చూసినవారు
శింగనమల: మంత్రుల దృష్టికి నియోజకవర్గ సమస్యలు
శింగనమల నియోజకవర్గ సమస్యలను ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ గురువారం రాష్ట్ర మంత్రులకు విన్నవించారు. ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి డోనాల బాలవీరాంజనేయస్వామిని కలిసి ఎస్సీ వసతి గృహ సమస్యలను తెలిపారు. బుక్కరాయసముద్రం మండలంలో అంబేడ్కర్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని కలిసి మిడ్పైన్నార్ డ్యాం సమస్యలను, ఉల్లికల్లు గ్రామ మునక సమస్యను తెలిపారు.

సంబంధిత పోస్ట్