శింగనమల: టమాటా రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి

85చూసినవారు
శింగనమల: టమాటా రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
శింగనమల నియోజకవర్గ పరిధిలోని రబీ సీజన్ లో టమాట పంట సాగు చేసిన రైతులు బీమా ప్రీమియం కింద తమ వాటా చెల్లించాలని శనివారం ఉద్యాన శాఖ అధికారి శైలజ పేర్కొన్నారు. వాతావరణ బీమా కింద టమాటాను నోటిఫై చేశారని. ఈ-క్రాప్ నమోదుతో పాటు ఎకరాకు రూ. 1, 600 ప్రకారం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందన్నారు. డిసెంబర్ 15వ తేదీ చివరి గడువు అని తెలిపారు. టమోటా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్