విద్యుదాఘాతంతోనే తాడిపత్రిలో ప్రమాదం

78చూసినవారు
తాడిపత్రిలోని లలితా మెగామాల్ లో మంగళవారం భారీగా అగ్నిప్రమాదం జరిగిన ఘటన తెలిసిందే. ఈ ఘటన మొదటగా షాపింగ్ మాల్ వెనకాల ఉన్న గోదాంలో విద్యుదాఘాతం జరిగిందని, అక్కడ ఉన్న పలు విలువైన వస్తువులు కాలిపోవడం, అనంతరం మాల్లో మంటలు వ్యాపించడంతో భారీగా ఆస్తినష్టం జరిగిందని పోలీసులు తెలిపారు. సుమారు రూ. 1. 50 కోట్ల నష్టం వాటిల్లిందని లలితా మెగామాల్ యజమాని విష్ణుకుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్