తాడిపత్రిలో భారీ పోలీసు బందోబస్తు

80చూసినవారు
తాడిపత్రి సమస్యాత్మక ప్రాంతం కావడంతో జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. వినాయక చవితి నిమజ్జనోత్సవం కార్యక్రమం నేడు జరగనుండటంతో తాడిపత్రి పోలీసు సబ్ డివిజన్ పోలీసులతో పాటు దాదాపు 250 మంది ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్