పెద్దవడుగూరు మండల పరిధిలోని మాసినేని పాఠశాల సమీపంలో శుక్రవారం ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక పిల్ల మృతి చెందింది. మృతి చెందిన జింక పిల్లను ఆర్టీసీ బస్సు డ్రైవర్ గమనించి బస్సును ఆపారు. జింక పిల్లను ప్రయాణికులు రోడ్డు పక్కకు తరలించి, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.