పెద్దవడుగూరు మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై మాసినేని పాఠశాల సమీపంలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంలో వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. హైవే పెట్రోల్ పోలీసులు గమనించి గుత్తి ఆసుపత్రికి అనంతరం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.