పెద్దవడుగూరు: బైక్ బోల్తాపడి యువకుడికి తీవ్ర గాయాలు

58చూసినవారు
పెద్దవడుగూరు మండలం 44వ జాతీయ రహదారిపై మాసినేని పాఠశాల సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు పామిడికి చెందిన యువకుడు మురళి ద్విచక్ర వాహనంపై గుత్తికి వెళ్తున్నాడు. మార్గం మధ్యలో వాహనానికి కుక్క అడ్డంగా వచ్చింది. కుక్కను తప్పించబోయి బైక్ బోల్తా పడింది. ప్రమాదంలో మురళి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గుత్తి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్