తాడిపత్రి: సినీనటి మాధవీలతపై ఫిర్యాదు

68చూసినవారు
తాడిపత్రి: సినీనటి మాధవీలతపై ఫిర్యాదు
తాడిపత్రిలోని పెన్నానది ఒడ్డున జేసీ పార్కులో మహిళలకు నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తే వాటిపై సినీనటి మాధవీలత అసత్య ప్రచారం చేయడంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని తెదేపా మహిళా నాయకులు పట్టణ ఎస్సై గౌస్ బాషా కు ఫిర్యాదు చేశారు. తాడిపత్రి చరిత్ర తెలియకుండా సామాజిక మాధ్యమాల్లో సినీనటి గంజాయి అమ్ముతున్నారని వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు తాడిపత్రిని, మహిళలను కించ పరిచే విధంగా ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్