తాడిపత్రి: 8 నాపరాళ్ల ట్రాక్టర్లు పట్టివేత

73చూసినవారు
తాడిపత్రి: 8 నాపరాళ్ల ట్రాక్టర్లు పట్టివేత
తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామ సమీపంలో ఆదివారం అధిక లోడు, అధిక వేగంతో వెళుతున్న 8నాపరాళ్ల ట్రాక్టర్లను సీజ్ చేశామని రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు. ఈమధ్యకాలంలో ట్రాక్టర్లు అధికలోడు వేసుకుని అధిక స్పీడుతో వెళుతుండడం వల్ల ప్రమాదాలకు కారణమవుతున్నాయన్నారు. వీటిని అరికట్టేందుకు ప్రత్యేక చొరవ తీసుకొని వాటి డ్రైవర్లకు సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు చెప్పారు. అధికలోడు ట్రాక్టర్లను సీజ్ చేసి జరిమానాలు విధిస్తున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్