తాడిపత్రిలో పది మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

62చూసినవారు
తాడిపత్రి మండలంలో పేకాట స్థావరాలపై పోలీసులు సోమవారం సాయంత్రం మెరుపు దాడులు నిర్వహించారు. మండలంలోని పులిపొద్దుటూరు గ్రామ సమీపంలోని పెన్నా నది ఒడ్డున పేకాట ఆడుతున్న పది మందిని సీఐ శివ గంగాధర్ రెడ్డి ఆయన సిబ్బందితో కలిసి అరెస్ట్ చేసినట్లు డి. ఎస్. పి రామకృష్ణుడు తెలిపారు. వారి వద్ద నుంచి 1, 50, 000/-రూపాయలు నగదు తో పాటు రెండు సెల్ ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు డి. ఎస్. పి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్