విజయవాడ వరద బాధితులకు రూ. 1. 26 లక్షల విరాళం

62చూసినవారు
విజయవాడ వరద బాధితుల సహాయార్థం తాడిపత్రి మెప్మా స్వయం సహాయక సంఘాలు రూ. 1, 26, 500 విరాళం అందజేశారు. ఈ సందర్భంగా గురువారం ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిని స్థానికంగా ఉన్న ఆయన నివాసంలోనే కలిసి చెక్కును అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సభ్యులను అభినందించారు.

సంబంధిత పోస్ట్