పేకాట ఆడుతున్న 10 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 10600 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఈరన్న బుధవారం తెలిపారు. యాడికి మండలంలోని కోనుప్పలపాడు గ్రామ సమీపంలోని కంపచెట్లలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో వెంటనే సిబ్బందితో కలిసి దాడిచేసినట్లు చెప్పారు. అందులో పదిమంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసినట్లు చెప్పారు.