అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గురువారం తలనీలాలు పోగు చేసుకొనే హక్కుకు, కొబ్బరి చిప్పల సేకరణకు వేలం నిర్వహించారు. తలనీలాలు సేకరించుకునే హక్కు 42 మంది పోటీ పడగా. ఉరవకొండకు చెందిన టీడీపీ నాయకుడు ఎంసీ మారన్న రూ. 27 లక్షలకు పాట దక్కించుకున్నారు. అటు కొబ్బరి చిప్పల సేకరణకు రూ. 5. 70 లక్షలకు చలపతి అనే వ్యక్తి పాట దక్కించుకున్నారు.