ఉరవకొండ పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ శంకర్ అనే వ్యక్తి అతిగా మద్యం తాగి మృతి చెందాడు. శంకర్ ఆటో నడుపుకుని జీవనం సాగిస్తున్నాడు. రోజూలాగే మంగళవారం ఉదయం అతిగా మద్యం తాగాడు. ఊరి చివరన పొలంలో ఆటోతో పాటు అపస్మారక స్థితిలో కనిపించాడు. దీంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన ఉరవకొండ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు.