ఉరవకొండ: విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నిరసనలు

73చూసినవారు
ఉరవకొండ: విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నిరసనలు
తాను అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ చార్జీలు పెంచేది లేదని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరు నెలల్లోనే ప్రజలపై రూ. 15వేల కోట్ల భారాన్ని మోపాడని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్