ఉరవకొండ పట్టణంలోని ఆర్టీసీ ప్రాంగణం ముందు ఉన్న కిరాణా దుకాణంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఇనుప రాడ్లతో షట్టరు పైకి లేపి దుండగులు లోపలికి ప్రవేశించారు. కేవలం చిల్లర నోట్లనే ఎత్తుకెళ్లినట్లు దుకాణ యజమాని తెలిపారు. విలువైన వస్తువులు, సరకులు అలాగే ఉన్నాయన్నారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.