వజ్రకరూరు: జరుట్ల రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు..

50చూసినవారు
వజ్రకరూరు: జరుట్ల రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు..
వజ్రకరూరు మండల కేంద్రంలోని జరుట్ల రాంపురంలో ఉన్న శ్రీ దుర్గా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక శనివారం సందర్భంగా స్వామి వారి మూల విరాట్ కు విశేష పూజలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. కార్తీకమాసం ప్రారంభమవడంతో స్వామివారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్