మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వైయస్సార్సీపి పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. శనివారం ఆముదాలవలస వైయస్సార్సీపి నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని వైయస్సార్ కూడలిలో.. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైసీపీ శ్రేణులు కేవివి సత్యనారాయణ, కే గోవిందరావు కేక్ కట్ చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. పండ్లు, బట్టలు పంపిణీ చేశారు.