డాక్టర్లపై దాడులను ఖండించండి

72చూసినవారు
బూర్జ మండల పరిధిలో పనిచేస్తున్న వివిధ స్థాయి వైద్య అధికారులు సిబ్బంది శనివారం మూకుమ్మడిగా నిరసన చేపట్టారు. డాక్టర్లపై సమాజంలో జరుగుతున్న దాడులను ముక్తకంఠంతో ఖండించారు. నో జస్టిస్ నో డ్యూటీ, బ్రతికించే వైద్యులను బలి తీసుకోకండి, మహిళలకు రక్షణ కల్పించాలని అంటూ నినాదాలు చేశారు. కలకత్తాలో జరిగిన డాక్టర్ హత్య ఘటనను ఖండించారు. దోషులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు

సంబంధిత పోస్ట్