నిమ్మతొర్లాడ, కొరపాం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

55చూసినవారు
నిమ్మతొర్లాడ, కొరపాం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
ఆముదాలవలస మండలం నిమ్మతొర్లా డ, కొరపాం గ్రామాలలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి మెట్ట మోహనరావు తెలిపారు. వ్యవసాయంలో సాంకేతిక విధానాలు, ఎరువులు, యాజమాన్యం, ప్రభుత్వ రైతు సంక్షేమ పథకాలు, వ్యవసాయంలో తెగుళ్లు నివారణ తదితర వాటి గురించి రైతులకు వివరించామని అన్నారు. రైతులకు అందుబాటులో వ్యవసాయ సిబ్బంది ఉంటారని వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్