ఆముదాలవలస నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం ఆవరణలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇన్చార్జ్ పేడాడ రామ్మోహన్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపన లక్ష్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎందరో త్యాగమూర్తుల కృషి ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం అని ఆయన అన్నారు