ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధి హాట్కొ కాలనీ వద్ద కూటమి ప్రభుత్వం 100 రోజుల సంబరాలు శుక్రవారం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క హామీని ఒక క్రమ పద్ధతిలో అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కూన రవికుమార్ కొనియాడారు. వంద రోజుల పరిపాలనలో చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. టిడిపి నాయకులు, జనసేన ఇన్చార్జ్ రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.