ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధి బీఆర్ నగర్ లో మున్సిపల్ కమిషనర్ పి బాలాజీ ప్రసాద్ గురువారం పర్యటించారు. బి ఆర్ నగర్ పార్క్ లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. పార్క్ లోపల పిచ్చి మొక్కలను స్థానికులతో కలిసి తొలగించి పార్కు పరిసరాలు శుభ్రం చేశారు. వర్షాకాలంలో నీరు వెళ్లే మార్గం లేక వీధుల్లో నీరు నిల్వ ఉంటుందని. ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరారు