బూర్జ మండలం పాలవలస గ్రామంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ గురువారం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహించారు. వంద రోజులలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు వివరించారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటిని అక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. నియోజకవర్గ పరిశీలకులు చంద్రశేఖర్ యాదవ్, పి విశ్వ ప్రసాద్, రామకృష్ణ, రాంజీ తదితరులు పాల్గొన్నారు.