దుర్గాదేవి ఆలయంలో చోరీ

75చూసినవారు
దుర్గాదేవి ఆలయంలో చోరీ
ఎచ్చెర్ల మండలం కుంచాల కురమయ్యపేట దుర్గాదేవి ఆలయంలో చోరీ జరిగింది. మంగళవారం ఉదయం గ్రామ సర్పంచ్ నర్సింగరెడ్డి ఆలయంలో దీపం వెలిగించడానికి వచ్చేసరికే ఈ విషయాన్ని గుర్తించారు. ఈమేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆలయంలో దుర్గాదేవి విగ్రహానికి 6 కేజీల వెండి అభరణాలు, శఠగోపం, దుర్గాదేవి మెడలోని తులం పుస్తెల తాడు, 9 శతమానాలను గుర్తు తెలియని వ్యక్తులు ఆపహరించుకుపోయారని గుర్తించారు.

సంబంధిత పోస్ట్