ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురం పంచాయతీ చిన్నరావుపల్లి గ్రామంలో మంగళవారం పశువులకు లంపి స్కిన్ టీకాలు వేయనున్నట్లు పశు వైద్యాధికారి డాక్టర్ రమణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పశువులకు వ్యాధులు సంక్రమించకుండా ఈ టీకాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. కావున ఈ విషయాన్ని పాడి రైతులు గమనించి, టీకాలు తప్పనిసరిగా పశువులకు వేయించాలని సూచించారు.