ఎచ్చెర్ల మండలంలో సాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఎచ్చెర్ల మండలానికి సాగునీరు, ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉపాధి హామీ పనులు, ఆర్అండ్ బి రహదారులుపై ఎచ్చెర్ల శాసన సభ్యులు నడికుదిటి ఈశ్వరరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ లతో కలసి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సాగునీటి సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు.