గణపతికి గరికతో ప్రత్యేక పూజలు

81చూసినవారు
లావేరు మండల కేంద్రంలోని శ్రీ రామాలయంలోని విజయ గణపతి కి చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా.. బుధవారం భక్తిశ్రద్ధలతో మహిళలు, భక్తులు గరికతో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఉమా శంకర్ శర్మ నేతృత్వంలో స్వామి వారికి అష్టోత్తర శతనామాలతో విశేష పూజాది కార్యక్రమాలు చేపట్టారు. పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్