సోంపేట లో వర్షం

69చూసినవారు
సోంపేట మండలం పరిధిలో ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు. అంతర పంటలుగా వేసిన వేరుశనగ, నువ్వులు, సన్ ఫ్ల‌వర్, చోడి తదితర పంటలకు ఈ వర్షం ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది.

సంబంధిత పోస్ట్