కంచిలి మండలం డీజి పురంలో అక్రమంగా ఎరువులు నిల్వలు ఉన్నట్టుగా గుర్తించిన వ్యవసాయ అధికారి ధనుంజయ రావు గురువారం తనిఖీలు నిర్వహించారు. 25 ఎరువుల బస్తాలు నిలువలు ఉన్నట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించిన బిల్లులు వేరే వేరే తేదీలతో ఉన్నట్లుగా గుర్తించి దీనిపై పూర్తి విచారణ చేసిన తర్వాత వాటిని వాడుకోవచ్చునని ఆదేశాలు జారీ చేశారు. లేనియెడల అవి సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.