ఖరీఫ్ సీజన్ చివరి దశకు చేరుతున్న సమయంలో అకాల వర్షాలతో జిల్లా వ్యాప్తంగా రైతులు భయాందోళనలకు బుధవారం గురి అయ్యారు. సోంపేట, కంచిలి, బారువ, పలాసపురం, లక్కవరం గ్రామాల్లో కోసిన వరి వరిని పెట్టి కవర్లు కప్పాలని అధికారులు అంటున్నారు. నూర్పిడి అయిన ధాన్యాన్ని తరలించేలా రైతు సేవ కేంద్రం ప్రతినిధులు, తహశీల్దార్, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచనలు చేస్తున్నారు.