కూర్మనాథ ఆలయానికి పోటెత్తిన భక్తజనం

83చూసినవారు
కూర్మనాథ ఆలయానికి పోటెత్తిన భక్తజనం
గార మండలంలోని శ్రీకూర్మనాథాలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సుదూరం నుంచి వచ్చిన భక్తులు ముందుగా మూలవిరాట్ను దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం లక్ష్మీదేవాలయం, వైష్ణవీదుర్గ, తాబేళ్లపార్కును సందర్శించారు. దేవస్థానంలో జరిగే నిత్యన్నదానంలో 300 భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులు రెండు క్యూలైన్ల ద్వారా స్వామిని దర్శించుకున్నారు. సిబ్బంది భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్