వీరఘట్టం మండల కేంద్రంలోని మోంట్ ఫోర్ట్ స్కూల్లో విద్యార్థులకు సైబర్ నేరాలు, మత్తు పదార్థాలపై ఎస్సై కళాధర్ అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండాలని సూచించారు. మహిళల భద్రతపై అవగాహన కల్పించారు. సైబర్ ఆన్లైన్ మోసాలు, మెసేజ్ రూపంలో వచ్చే లింక్ పై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.