20 లీటర్ల నాటు సారా, 3,400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

586చూసినవారు
20 లీటర్ల నాటు సారా, 3,400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని ఎస్సీబీ అధికారులు, టాస్క్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ విభాగం సంయుక్తంగా నాటు సారా స్థావరాలపై ఆకస్మిక దాడులను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని రామరాయి, తపాగాం గ్రామాల పరిధిలో 20 లీటర్ల నాటుసారా మరియు 3, 400 లీటర్ల బెల్లం
ఊటను ధ్వంసం చేశారు. అనంతరం ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.