పలాస పోలీసులకు కూటమి నాయకులు వైకాపా శ్రేణులపై మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ. గత ప్రభుత్వ హయాంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్లతో పాటుగా పలాస నియోజకవర్గ గౌతు కుటుంబాలపై సోషల్ మీడియాలో వైకాపా నాయకులు చేసిన అసత్య ప్రచారాలు, ట్రోల్స్ పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.