వంశధార నదిలో క్రమేపీ వరద నీటి ఉధృతి తగ్గుముఖం పడుతుంది. ఇటీవల కురిసిన వర్షాలకు వంశధార నదిలో 30 వేలు క్యూసెక్కుల వరద నీరు పెరిగింది. తగ్గుతూ పెరుగుతూ నదిలో వరద నీరు ప్రవహించడం జరిగింది. బ్యారేజీ 11 గేట్లు 40 సెంటీ మీటర్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం నదిలో 13 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. బ్యారేజీకి అనుసంధానంగా ఉన్న కుడి, ఎడమ, ప్రదాన కాలువలకు సాగు నీటి సరఫరా నిలిపి వేశారు.