నీలకంఠేశ్వర స్వామికి 108 బిందెల అభిషేకం

51చూసినవారు
హిర మండలం కొండరాగోలు గ్రామంలోని భవానీ నీలకంఠేశ్వర స్వామి పురాతన ఆలయంలో శనివారం స్వామి వారికి 108 బిందెల అభిషేకం చేశారు. బాద్రపద మాసంలో వచ్చే ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామి వారికి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు విష్ణు ప్రసాద పండా, సూర్య ప్రకాష్ పండా సాంప్రదాయ పద్ధతిలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల భక్తులు దర్శించుకుని పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్