సీతారాం ఏచూరి మృతికి సంతాపం

51చూసినవారు
సీతారాం ఏచూరి మృతికి సంతాపం
సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి, కమ్యూనిస్టు మేధావి కామ్రేడ్ సీతారం ఏచూరి మృతికి సంతాపం తెలియజేస్తూ.. ఆదివారం ఎల్ఎన్ పేట మండల కేంద్రంలో సంస్మరణ సభ నిర్వహించారు. సీతారాం ఏచూరి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిర్ల.ప్రసాద్ మాట్లాడుతూ.. సీతారాం ఏచూరి కమ్యూనిస్టు ఉద్యమంలో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింహాచలం,జీవరత్నం, జి.వెంకటరమణ, గోవిందరావు, సంతోష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్