పాతపట్నం మండలం సింగుపురం గ్రామానికి చెందిన జనసేన నాయకులు ఏనుగుతల. వైకుంఠ రావు సొంత నిధులతో 2.50 లక్షలతో త్రాగు నీరు కోసం బోర్, పైపులైన్ ఏర్పాటు చేశారు. ఆదివారం అభివృద్ధి పనులు ఆయన ప్రారంభించారు. గ్రామంలో కొన్ని వీధులకు త్రాగు నీరు సరఫరా లేదని వీధి వాసులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై స్పందించి పనులు చేపట్టి త్రాగు నీరు సరఫరా చేశారు. గ్రామస్తులు ఆయనకు అభినందనలు తెలిపారు.