పాతపట్నం మండలంలోని ఆర్. ఎల్. పురం గ్రామంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బైదలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో వైద్యాధికారి జి.సదాశివం రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో 100 మంది రోగులకు వైద్య సేవలు అందించారు.