ఉచిత ఇసుక పథకం టిడిపి నాయకులకే సొంతం.. మాజీ ఎమ్మెల్యే

80చూసినవారు
ఉచిత ఇసుక పథకం జిల్లాలోని ఎమ్మెల్యేలకు, ఎంపీలకే అందుతుందని, పేదవాడికి లేదని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. పాతపట్నంలోని తన కార్యాలయంలో గురువారం ఆమె మాట్లాడుతూ నాలుగు నెలల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, ఒక్క పథకాన్ని కూడా సరిగా అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. ఈ నాలుగు నెలలు మందు, ఇసుక అనే స్వరంతో గడిచిపోయాయని, ప్రజలు బాధలు పట్టించుకోవట్లేదని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్