లక్ష్మీ నర్సుపేట మండలంలోని జగన్నాథ స్వామి ఆలయంలో శనివారం ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. భాద్రపద మాసంలో వచ్చే పవిత్ర ఏకాదశి పర్వదినం సందర్భంగా విష్ణు ఆలయంలో అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారికి పూజలు చేశారు. ఆలయ అర్చకులు లక్ష్మీనారాయణ పత్రి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు.