హిరమండలంలో ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద అలికాం-బత్తిలి రహదారిలో గుంతలు ప్రమాదకరంగా మారాయి. వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనచోదకులు, ప్రయాణికులు ప్రమాదపుటంచున ప్రయాణిస్తున్నారు. గుంతలు గుర్తించక వాహనదారులు బోల్తా పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి గుంతలు పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు.