ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గోవిందరావు

83చూసినవారు
కొత్తూరు మండలం నేరడి గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణానికి రూ. 20 వేలు కమిటీ సభ్యులకు విరాళంగా అందజేశారు. అయన మాట్లాడుతూ. గ్రామంలో ఆలయాలు నిర్మించాలన్న సంకల్పం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. గ్రామాలలో ఎవరైనా ఆలయాలు నిర్మించుకోవాలంటే తన వంతు సహకారాన్ని అందజేస్తానని ఎమ్మెల్యే తెలియజేశారు.

సంబంధిత పోస్ట్