సీఎం చంద్రబాబు నాయుడు కృషితో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఆర్థిక భరోసా లభించిందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. మంగళవారం పాతపట్నం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సీఎం చంద్రబాబు కృషి పట్టుదలతో ఆర్థిక సంక్షోభంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు రూ. 11, 440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ సాధించారన్నారు.