కోరాడ కాలనీ యుపి పాఠశాల హైస్కూల్ గా అపగ్రేడ్ కు ప్రతిపాదనలు

69చూసినవారు
కోరాడ కాలనీ యుపి పాఠశాల హైస్కూల్ గా అపగ్రేడ్ కు ప్రతిపాదనలు
హిరమండలం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కోరాడ కాలనీలోని ప్రాథమికోన్నత పాఠశాల హైస్కూల్ అపగ్రేడ్ కోసం డిఇఓ కు ప్రతిపాదనలు నివేదిక అందజేయనున్నట్లు టెక్కలి డెప్యూటీ డిఇఓ పి. విలియమ్స్ తెలిపారు. బుధవారం పాఠశాలను సందర్శించారు. మౌళిక సౌకర్యాలు, తరగతి గదులు, ఆట స్థలం, విద్యార్థులు సంఖ్య ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి పొగిరి బుచ్చిబాబు, ఎంఇవో కె. రాంబాబు, సర్పంచ్ రోజా రాణి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్